Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News:

latest

Telugu Kavithalu on Maoist Leader RK | Telugu Poetry on Maoist leader RK

Telugu Kavithalu on Maoist Leader RK | Telugu Poetry on Maoist leader RK  Telugu Poetry on Telugu script: అరణ్యం గుండె నుండి విరిసిన ఎర్రమల్...

Telugu Kavithalu on Maoist Leader RK | Telugu Poetry on Maoist leader RK


Telugu Kavithalu on Maoist Leader RK | Telugu Poetry on Maoist leader RK

 Telugu Poetry on Telugu script:

అరణ్యం గుండె నుండి విరిసిన ఎర్రమల్లి అతను అతను ప్రజల్లో ఒక విశ్వాసవేగుచుక్క కార్మిక కర్షక రైతుకూలీ గుండెల్లో పెద్ద ధైర్యంతో కూడిన అండ రాజ్యం గుండెల్లో ధిక్కారస్వరం, ప్రజలకు ఇప్పటికీ, ఎప్పటికీ వీరుడై నిలుస్తూనే ఉంటాడు..

అతడు అరణ్యంలో వెలిగే ఆదివాసీ నెగడు ఎక్కడ పీడిత పక్షం ఉంటే అక్కడే అతడు కష్టాలు కన్నీళ్లు తుడిచే అతని చేతులు జనం సర్వస్వంగా నమ్మి జనం కోసం రక్తతర్పణం చేసే మహా యోధుడు ఇతను..

అతని మనసుకు అనారోగ్యం లేదు అతని మేధస్సు హృదయం జనలోకం కష్టాలను తీర్చే నిరంతర ప్రణాళిక అతడు కష్టాల నదులను రాజ్యం వ్యూహాలను చేధించుకొని ప్రజల ఒడ్డుకు చేరిన ప్రజానదిలో చేప అతను ఎప్పటికీ ప్రజల నోళ్ళలో వినిపించే ఆపద్బంధువు..

అతను మరణించలేదు సూర్యునికి మరణం ఉండదు అతనికి పునర్జీవనమే మబ్బులు కమ్మేసిన మళ్లీ మళ్లీ ఉదయిస్తూనే ఉంటాడు జన ఆకాశంలో అతని బాట ఎప్పటికీ ఆదర్శ ఆచరణల మార్గదర్శిగా ఉంటుంది. అతని త్యాగం అమూల్యం ఆయన ప్రజా బాటసారి...

రచించిన వారు: డా. సిహెచ్.ఆంజనేయులు

No comments